సిల్వర్ ఓక్ మొక్కల పంపిణీ: దారకొండలో ఉత్సాహంగా పాల్గొన్న రైతులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి మండలం దారకొండలో విబీజీ రామ్జీ ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు సిల్వర్ ఓక్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ మొక్కలు తక్కువ నీటితో పెరిగి ఐదు నుంచి ఏడేళ్లలో మంచి ఆదాయాన్ని అందిస్తాయని టెక్నికల్ అసిస్టెంట్ రామ్మూర్తి తెలిపారు. కాఫీ, మిరియాల పంటలకు ఈ మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.