ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్థానిక ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. వైద్య సేవల తీరును స్వయంగా పరిశీలించి, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.