అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ అమ్మాయి భావిత మందవ

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

అమెరికాలోని న్యూయార్క్ సబ్వే ప్లాట్ఫారమ్పై జరిగిన యాదృచ్ఛిక పరిచయంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్లు హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ మోడల్ భావిత మందవ తెలిపారు. మొదట ఆర్కిటెక్చర్ అభ్యసించిన ఆమె, అనూహ్యంగా బోట్టెగా వెనెటా బ్రాండ్ ద్వారా అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ రింగ్స్ అవార్డుకు ఎంపిక కావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, ఛానెల్ హౌస్ అంబాసడర్గా ఎంపికై తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.