వినాయక చవితి వేడుకల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అందరి సహకారం అవసరం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వినాయక చవితి నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరు సహకరించాలని ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. జన్నారం పోలీస్ స్టేషన్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ నాయకులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సమయంలో డీజేలకు అనుమతి లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.