మునిపంపులలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు సన్మానం
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి టీచర్లను ఘనంగా సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కట్ట యాదయ్య ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. సమాజ ఆరోగ్యానికి అంగన్వాడి సేవలు మరువలేనివని మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి ప్రశంసించారు.