అభివృద్ధి చెందుతున్న దేశాలతో భారత్ బలమైన ఆర్థిక వారధులు నిర్మిస్తోంది

రిపోర్టర్: కిరణ్ స్థలం: దిల్లీ

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్న వేళ భారత్ ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాల్ని బలోపేతం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 40 దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. వ్యాపార రంగంలో అడ్డంకులను తొలగించి, సరికొత్త అవకాశాలను విస్తరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోదీ తేల్చిచెప్పారు.