విజయనగరం జీజీహెచ్‌లో సిబ్బంది కొరతతో రోగులకు తీవ్ర ఇబ్బందులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది కొరత రోగులను వేధిస్తోంది. శాశ్వత ఉద్యోగులు లేకపోవడం, పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్య సేవలు మందగించాయి. రోజూ వేలాది మంది ఓపీకి వస్తున్నా, తగినంత మంది స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. అత్యవసర సమయాల్లోనూ సకాలంలో వైద్యం అందక రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు.