స్థానిక సంస్థల ఎన్నికలపై పలాసలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తంగుడు వీర్రాజు అధ్యక్షతన ఘనంగా జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై నేతలు చర్చించారు. క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు.