అయిదేళ్లుగా అసంపూర్తిగానే కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణం

రిపోర్టర్: రాము స్థలం: పార్వతీపురం మన్యం

ఉమ్మడి జిల్లాకు మంజూరైన కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల అయిదేళ్లుగా ప్రవేశాలకు నోచుకోలేదు. వసతి సౌకర్యాన్ని సాకుగా చూపి నిర్మాణాలు నిలిపివేయడంతో పనులు పాడైపోతున్నాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పరికరాలు చోరీకి గురవుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిర్మాణాలు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి స్పష్టం చేశారు.