ఆర్ణబ్ తుఫాను నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆర్డీవోకు వినతి
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
ఆర్ణబ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణమే సహాయక చర్యలు అందించాలని కోరుతూ పలాస ఆర్డీవోకు ఏఐకేఎంఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు తగిన పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు.