కూకట్‌పల్లిలో మద్యం మత్తులో కారు బీభత్సం: 8 బైకులు ధ్వంసం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kukatpally, Hyderabad

హైదరాబాద్ కూకట్‌పల్లిలో మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన పార్క్ చేసిన 8 బైకులను బలంగా ఢీకొట్టింది. కారులో మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.