ముక్త్యాల కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

రిపోర్టర్: రాము స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. సెలవు దినం కావడంతో స్నేహితులు కలిసి కాలువలో దిగగా ప్రమాదం జరిగింది. స్థానికులు ఒకరిని రక్షించగా, మరో ఇద్దరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలించారు.