సూర్య సినిమాలను తాను రిజెక్ట్ చేయలేదంటూ నటి నజ్రియా స్పష్టత
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
సూర్య సినిమాలలో నటించే అవకాశాలను తాను ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదని, కేవలం డేట్స్ సర్దుబాటు కాకనే నటించలేకపోయానని నటి నజ్రియా స్పష్టం చేశారు. కేరళలో జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ, సూర్య సరసన నటించడం తన కల అని తెలిపారు. గతంలో తన మూడు సినిమాలను ఆమె రిజెక్ట్ చేశారంటూ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక జోక్ మాత్రమేనని నజ్రియా వివరణ ఇచ్చారు.