అవినీతి సొమ్ముతో కోర్టులను కొనలేరంటూ జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

రిపోర్టర్: మహేష్ స్థలం: కృష్ణా

అవినీతి సొమ్ముతో న్యాయస్థానాలను కొనలేరంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతగా కోర్టులను మాయ చేయాలని ప్రయత్నించినా నిజం ఎప్పటికీ దాగు ఉండదని, న్యాయం ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వైఎస్ జగన్ తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.