ఉత్తరప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 25తో సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.