రామ మందిర విరాళాల గోల్మాల్ కేసులో సిట్ ఛార్జిషీట్ దాఖలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అయోధ్య
అయోధ్య రామ మందిర విరాళాల స్వాహా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అయోధ్యలోని అదనపు జిల్లా కోర్టులో ఏడుగురు నిందితులపై సుమారు 70 వేల పేజీలతో కూడిన భారీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆలయ విరాళాల లెక్కింపు సమయంలో అనధికారికంగా నగదును మళ్లించారనే ఆరోపణలపై జూన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తు అధికారులు రూ. 79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.