నాగ్‌పూర్ ఎయిమ్స్ లో నిరసన విరమించిన రెసిడెంట్ డాక్టర్లు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నాగ్‌పూర్
నాగ్‌పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామని పోలీసులు, ఆసుపత్రి యంత్రాంతరం హామీ ఇవ్వడంతో రెసిడెంట్ డాక్టర్లు శుక్రవారం తమ నిరసనను విరమించినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 22న జరిగిన దాడి తర్వాత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట వేస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో ఆందోళన విరమించారు.