డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో సంచలనం: బినామీ ఆస్తులు అటాచ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Sangareddy
అవినీతి నిరోధక శాఖకు పట్టుబడి సస్పెండయిన డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి కేసులో ఆదాయపు పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్ కీలక చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. అధికారిక ప్రయోజనాలకు ప్రతిఫలంగా సమకూర్చిన రెండు ఇళ్లు, మూడు ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు, లగ్జరీ కారును తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు వెల్లడించారు. ఈ అటాచ్ చేసిన ఆస్తుల రికార్డు విలువ యాభై తొమ్మిది లక్షలకు పైగా ఉందని స్పష్టం చేశారు.