తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాత మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: శంకరపట్నం

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత అనారోగ్యంతో మృతి చెందగా, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. సుజాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, పార్టీకి సేవలు అందించిన నాయకురాలను కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.