తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, ప్రశాంతంగా శ్రీవారి దర్శనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే పనిలేకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం లభిస్తోంది. నిన్న ఒక్కరోజు 88,210 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 30,192 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ. 4.23 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.