మున్సిపల్ ఎన్నికల సమరానికి సిద్ధం: బీజేపీ మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. అనంతపురం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోట్ల అజేష్ బాబుతో పాటు పలువురు చైర్మన్ అభ్యర్ధులను ఆయన ప్రకటించారు. యలమంచిలికి పిల్లా రమా కుమారి, గూడూరుకు దామం సునీతా భాయ్, నెల్లిమర్లకు మైపాడ ప్రసాద్లను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.