గుర్గావ్ లో విషాదం: పదో అంతస్తు నుంచి పడి యువకుడు దుర్మరణం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గుర్గావ్
గుర్గావ్ లోని సెక్టార్ 85 లో గల లీఫ్ సొసైటీ అపార్ట్ మెంట్ లో పదో అంతస్తు నుంచి కింద పడి ఇరవై ఎనిమిదేళ్ల ఆషిమ్ అనే యువకుడు దుర్మరణం చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి సత్యవాన్ ఖాచి కుమారుడైన ఆషిమ్ కొద్దిరోజులుగా మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం బాల్కనీలో నడుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.