గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు: ఆమనగల్లులో 35 కిలోల సరుకు స్వాధీనం
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆమనగల్లు పోలీసులు, ఎస్ఓటీ బృందం శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 35 కిలోల గంజాయిని, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 17,60,000/- ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.