బాలాపూర్ గణేష్ మండపంలో ఎన్ రామచందర్ రావు పూజలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
బాలాపూర్ గణేష్ మండపాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తొలి పూజలు నిర్వహించి, విఘ్నేశుడికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు. రాష్ట్ర ప్రజల సుభిక్షం, ఐక్యత కోసం భగవంతుని ఆశీస్సులు కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు.