నల్లగొండ జిల్లాలో ఉద్రిక్తత: పూజలకు ముందే దుర్గామాత విగ్రహం నిమజ్జనం

రిపోర్టర్: సునీల్ స్థలం: నల్లగొండ

నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ఠాపన స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. దీంతో కనీసం పూజలు కూడా నిర్వహించకుండానే దుర్గామాత విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ పరిణామంతో తొమ్మిది రోజుల పాటు జరగాల్సిన ఉత్సవాలు పూర్తిగా నిలిచిపోగా, పవిత్ర పండుగ వేళ జరిగిన ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.