చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించం: ఎస్పీ దామోదర్
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా భోగాపురంలో యువకుడిని చిత్రహింసలకు గురిచేసి వీధుల్లో తిప్పిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహన యాక్సిడెంట్ వివాదంలో రాజేష్ అనే యువకుడిని బంధించి, రాత్రంతా కొట్టి, షర్ట్ విప్పించి వీధుల్లో ఊరేగించారు. బాధితుని ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, ఎట్రాసిటీ కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు.