మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఆసక్తికర చర్చ.. పునర్జన్మ కాన్సెప్ట్?
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ఫిల్మ్ నగర్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా పునర్జన్మ కాన్సెప్ట్ తో ఈ సినిమాను డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ దాదాపు 40 నిమిషాల పాటు కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.