మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కాకా చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి కదిరి కాళీదాస్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులను ఏకకాలంలో జరుపుతూ చిత్ర యూనిట్ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తోంది.