మొబైల్ అన్న కాంటీన్ వద్ద ఉచిత భోజనాల ఏర్పాటుపై మంత్రి నిమ్మల హర్షం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పశ్చిమ గోదావరి
గని ఆత్కూరు గ్రామానికి చెందిన దామినేని శ్రీనివాసరావు మరియు రజని కుమారి దంపతుల ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి మొబైల్ అన్న కాంటీన్ వద్ద ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత భోజన సేవలు అందించిన దాతలకు మంత్రి రామానాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.