కేంద్ర ప్రభుత్వ నిర్ణయం: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకం పెంపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విండ్ ఫాల్ గెయిన్స్ పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా సమీక్షలో భాగంగా డీజిల్ మరియు ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దేశీయంగా విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలపై ఈ పన్ను మార్పుల ప్రభావం ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.