జానీ మాస్టర్ భార్య సుమలత కార్యవర్గం రద్దు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో వివాదం ముదిరింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత కార్యవర్గాన్ని ఫెడరేషన్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సుమలత, రఘు మాస్టర్‌తో నిర్వహించిన సమావేశానికి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు మాత్రమే మద్దతు తెలపగా, రఘు మాస్టర్‌కు భారీగా 214 మంది డ్యాన్సర్లు మద్దతు ప్రకటించారు.