వంటను సులువు చేసేలా హైదరాబాద్ బ్రాండ్ ఇన్స్టంట్ తడ్కా నెయ్యి విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా వంటను సులభతరం చేసే లక్ష్యంతో హైదరాబాద్ కు చెందిన క్లీన్-లేబుల్ ఫుడ్ బ్రాండ్ వి-రిచ్ సంస్థ ఇన్స్టంట్ తడ్కా నెయ్యిని మార్కెట్లోకి పరిచయం చేసిందని వ్యవస్థాపకురాలు, సీఈఓ యోగిత జాహ్నవి తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పాటు ఏడు సంప్రదాయ పోపు పదార్థాలను కలిపి దీనిని తయారు చేసినట్లు వెల్లడించారు. ఎటువంటి నిల్వ కారకాలు లేకుండా రూపొందించిన ఈ తడ్కా నెయ్యితో వంటకాలకు సరికొత్త రుచిని అందించవచ్చని ఆమె పేర్కొన్నారు.