ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు విజయవాడలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొని ఉత్తమ టీచర్లకు అవార్డులు ప్రదానం చేస్తారు. నెల్లూరు జిల్లా మనుబోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లాలో మంత్రుల బృందం ప్రజా చేరువ కార్యక్రమం నిర్వహించనుంది.