ఉత్తరప్రదేశ్ లో కలకలం: లక్షలాది నకిలీ ఈమెయిల్ ఐడీల తయారీదారు అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Lucknow
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా విదేశీ పరిచయస్తులకు లక్షలాది నకిలీ ఈమెయిల్ ఐడీలను సృష్టించి అమ్ముతున్న అంకిత్ శంఖ్వార్ అనే యువకుడిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నకిలీ ఖాతాలను ఉపయోగించి దేశంలోని ప్రముఖ పాఠశాలలు, కీలక సంస్థలకు బాంబు బెదిరింపులు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.