రంజీ ట్రోఫీ: అదరగొట్టిన తుషార్ దేశ్‌పాండే, ముంబై పట్టు బిగింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: బిలాస్పూర్
రంజీ ట్రోఫీ గ్రూప్ డి మ్యాచ్‌లో ముంబై పేసర్ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగి హిమాచల్ ప్రదేశ్‌ను 140 పరుగులకే కట్టడి చేశారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసిందని, తొలి ఇన్నింగ్స్ లీడ్‌కు కేవలం ముప్పై మూడు పరుగులు మాత్రమే దూరంలో నిలిచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.