శ్రీకాకుళంలో భారీ వర్షాలు మరియు ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Srikakulam

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బహుదా నదితో పాటు వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి. వందలాది ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల తీవ్రత నేపథ్యంలో జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.