యూజీసీ నెట్ జూన్ పరీక్షా ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించి సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్షలకు మొత్తం 1,96,491 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 1,20,355 మంది హాజరయ్యారు. జేఆర్ఎఫ్ కోసం 824 మంది, అసిస్టెంట్ అర్హతకు 11,610 మంది, పీహెచ్డీ ప్రవేశాల కోసం 23,154 మంది అర్హత సాధించారు.