కృష్ణపట్నం పోర్టుకు అరుదైన గుర్తింపు: పదిహేను విభాగాల్లో అవార్డులు కైవసం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

తిరుపతి వేదికగా క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతిష్టాత్మకమైన పదిహేను అవార్డులను కైవసం చేసుకున్నట్లు పోర్టు సీఈవో జగదీష్ పటేల్ వెల్లడించారు. నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారం, మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ సదస్సులో తొమ్మిది బంగారు పతకాలు, ఒక రజత పతకం, వ్యక్తిగత విభాగాల్లో మూడు అవార్డులతో పాటు ఒక ఉత్తమ ప్రదర్శన అవార్డు దక్కడం విశేషం.