తలనీలాల సేకరణ హక్కుల కోసం మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలోని మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానంలో అమ్మవారి తలనీలాలు సేకరించే హక్కులకు బహిరంగ వేలం నిర్వహించారు. 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు తలనీలాలు సేకరించే హక్కుల కోసం నిర్వహించిన వేలంలో ఆరుగురు పాల్గొన్నారు. జడ్చర్ల గ్రామానికి చెందిన వజ్రగిరి రామయ్య రూ.2,56,000లకు వేలాన్ని దక్కించుకున్నారు. దేవస్థాన నిబంధనల ప్రకారం పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.