జర్మనీలో నర్సులుగా ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించగా నర్సింగ్ అభ్యర్థులకు జర్మన్ భాషలో శిక్షణ అందించి విదేశాల్లో ఉపాధి కల్పిస్తున్నారు. ఓంక్యాప్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది నర్సులు జర్మనీలో ఉద్యోగాలకు ఎంపిక కాగా వారికి అధికారులు జాబ్ ఆఫర్ లెటర్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి వేలాది మంది విదేశీ ఉద్యోగాలకు వెళ్లారు.