ఇట్లు అర్జున ప్రత్యేకతలు వెల్లడించిన నటి అనస్వర రాజన్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

ఈ నెల పదమూడున ప్రేక్షకుల ముందుకు రానున్న ఇట్లు అర్జున చిత్రంలో తాను కీర్తి అనే అమాయక పాత్రలో నటిస్తున్నట్లు కథానాయిక అనస్వర రాజన్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో ముచ్చటించిన ఆమె, ఈ సినిమా కథాంశం ఎంతో వైవిధ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని, నాగార్జున ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడం ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేశారు.