2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు: అచ్చెన్నాయుడు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh

రాష్ట్రంలో నిరుపేదలందరికీ సొంత ఇంటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2029 నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని మంత్రి వెల్లడించారు.