ఖమ్మంలో దీపావళి వేడుకల భద్రతపై కలెక్టర్ దివాకర కీలక ఆదేశాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Khammam

ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ దీపావళి వేడుకలు జరుపుకునే సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు జేశారు.