అర్నబ్ తుఫాన్ బాధితులకు భారీ ఊరట: ఎనిమిది కోట్ల నిధులు విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు విడుదల చేసిందని అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు రూ.4 కోట్ల చొప్పున కేటాయించారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న ఒక్కో బాధితుడికి రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.3,000 మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు.