రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు తెలంగాణ పోలీస్ శాఖ విజ్ఞప్తి
రిపోర్టర్: నరేష్
స్థలం: Telangana
రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని, వాహనదారులు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని తెలంగాణ పోలీస్ శాఖ (@TelanganaCOPs) స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేక సందేశం విడుదల చేసింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించి సహకరించాలని పోలీస్ యంత్రాగం కోరింది. ప్రయాణాల్ లో ప్రాణ రక్షణే అత్యంత ప్రాధాన్యమని అధికారులు గుర్తుచేశారు.