'ముద్దా ఏదైనా రాహుల్ స్క్రిప్ట్ అదే': కాంగ్రెస్ నేత తీరుపై బీజేపీ సెటైర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 'ముద్దా ఏదైనా రాహుల్ స్క్రిప్ట్ అదే, దేశాన్ని భ్రమింపజేయడమే ఆయన పని' అంటూ బీజేపీ ఎంపీ సుధాషు త్రివేది వ్యాఖ్యలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ తన చర్యలతో ఆ వ్యాఖ్యలను ఎప్పుడూ నిజం చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.