గోదావరి ప్రవాహాల అధ్యయనంపై ఏపీకి కేంద్ర జలసంఘం తాజా లేఖ

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

గోదావరి ప్రవాహాలు మరియు నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం 2023లో నిర్వహించిన అధ్యయనంపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆ సంఘం చీఫ్ ఇంజనీర్ రాకేశ్ కుమార్ లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. ఈ అధ్యయనంపై గతంలో దిల్లీలో జరిగిన సమావేశాల్ లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చామని, పోలవరం బనకచర్ల అనుసంధానంపై కూడా చర్చించామని ఆ లేఖలో స్పష్టం చేశారు.