ఏసీబీకి చిక్కిన మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ సూపరింటెండెంట్ సునీత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మెహిదీపట్నం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. పద్మనాభనగర్‌లో భవన నిర్మాణ అనుమతి కోసం రూ.8 లక్షలు డిమాండ్ చేసి, లక్డీకాపూల్ వద్ద స్కూటీ డిక్కీలో నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి విచారణ చేపడుతున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.