విజయనగరం జిల్లాలో నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్పష్టంగా లేని, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ ఎస్.రాము హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.