విద్యార్థుల సమస్యల పరిష్కార వేదికగా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

పాఠశాల, ఐటీఐ, పాలిటెక్నిక్, కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులను ఒక వేదికపైకి తీసుకువచ్చి సమాజంలోని సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో సృజనాత్మకతను, ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఈ ప్రత్యేక వేదిక ఎంతగానో దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు.